
ప్రముఖ తెలుగు సినీ నిర్మాత దిల్ రాజు మెగాస్టార్ చిరంజీవి రాజకీయ ప్రవేశానికి తన మద్దతు తెలియజేస్తున్నారు. చిరింజీవిని రాజకీయాల్లో చూడడం సామంజస్యంగా ఉంటుందని, చిరంజీవి లాంటి నాయకుడు రాజకీయాల్లో అవసరమని ఆయన అన్నారు. దిల్ రాజు చిరంజీవికి మద్దతు తెలిపిన నేపథ్యంలో మరో ప్రముఖ నటుడు బాలకృష్ణ వైపు ఎవరుంటారనేది ప్రశ్నార్థకంగా మారింది. దిల్ రాజు నెంబర్ నిర్మాత కావడమే అందుకు కారణం. దిల్ రాజా చిరంజీవి మేనల్లుడు అల్లు అర్జున్ హీరోగా తాజాగా పరుగు అనే సినిమా తీశారు.గత కొద్ది నెలలుగా చిరంజీవి రాజకీయాల్లోకి వస్తారనే వార్తలు వెలువడుతున్న విషయం తెలిసిందే. దీంతో సినిమా రంగంలో ప్రముఖులు రెండుగా చీలిపోయారు. చిరంజీవికి మద్దతు తెలుపుతున్నవారితో పాటు వ్యతిరేకంగా మాట్లాడుతున్నవారూ ఉన్నారు. చిరంజీవిని మోహన్ బాబు, రాజశేఖర్ వంటి సీనియర్ నటులు కొంత మంది వ్యతిరేకిస్తున్నారు. నాగార్జున, వెంకటేష్ వంటి మరికొంత మంది చిరంజీవికి మద్దతు ప్రకటిస్తున్నారు.
No comments:
Post a Comment